Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

పురీష నాళమే సాధనంగా స్మగ్లింగ్.. బంగారాన్ని అలా దాచేశాడు..

స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను స్మగ్లింగ్‌ కోసం ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. స్మగ్లింగ్‌కు తన పురీషనాళాన్నే సాధనంగా చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం దుబాయ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ యువకుడి ప్రవర్తన

Advertiesment
Delhi Airport
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (13:10 IST)
స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను స్మగ్లింగ్‌ కోసం ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. స్మగ్లింగ్‌కు తన పురీషనాళాన్నే సాధనంగా చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం దుబాయ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ యువకుడి ప్రవర్తన అనుమానంగా ఉండటంతో.. కస్టమ్స్ అధికారులు అతన్ని రహస్యంగా తనిఖీ చేయించారు. 
 
ఈ సందర్భంగా అతడి పాయువులో దాచేసిన బంగారు కడ్డీలను గుర్తించారు. ఆపై అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.1.5 కోట్ల విలువ చేసే.. 1.04 కిలోల బరువైన తొమ్మిది బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న చెన్నైకి చెందిన ఒక వ్యక్తిని, ఫ్రాన్స్ జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల బంగారు కడ్డీ, 5 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వైస్ ప్రిన్స్‌పల్ దొంగగా మారిపోయాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన పసుపులేటి రమేశ్‌బాబు ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనం చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. 
 
నూజివీడులో ఇల్లు చూసేందుకు వచ్చిన రమేష్.. ఇంటి ఓనర్ సులోచన ఒంటిపై ఆభరణాలను దోచుకున్నాడు. తాను ఇవ్వనని బాధితురాలు ఎదురు తిరగడంతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఆభరణాలు దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. 24 గంటలు గడవక ముందే నిందితుడిని పట్టుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్ను మరిచిపోలేనురా.... భర్తను చంపి జైలుకెళ్తా.. బెయిలుపై విడిపించు... కన్నింగ్ లేడీ