Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారు... చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నోట్ల రద్దు వల్ల ప్రజలు అందరూ ఇబ్బందులుపడ్డారు. నేను రూ.500, రూ.2000 నోట్లు రద్దు చేయమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియ

ప్రధాని మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారు... చంద్రబాబు
, సోమవారం, 3 సెప్టెంబరు 2018 (21:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన మాట్లాడుతూ...  ''నోట్ల రద్దు వల్ల ప్రజలు అందరూ ఇబ్బందులుపడ్డారు. నేను రూ.500, రూ.2000 నోట్లు రద్దు చేయమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియోగం పెంచమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగితే మోసాలు తగ్గుతాయి. ఆధార్ భీమ్ యాప్ ప్రదేశపెట్టింది మనమే. క్యూఆర్ కోడ్ ఇచ్చిన మొదటి రాష్ట్రం కూడా మనదే.
 
బ్యాంకుల్లో ఫ్రాడ్ జరుగుతోంది. వాటిపై నమ్మకం పోయింది. ఎన్డీఏ వచ్చిన తరువాత గ్రోత్ ఆగిపోయింది. స్విస్ బ్యాంకుల్లో మన దేశ డబ్బుని ఏడాది లోపల తెస్తామని చెప్పారు. ఇంతవరకూ ఆ జాడే లేదు. అమరావతిలో హైకోర్టుని డిసెంబర్ నెకు సిద్ధం చేస్తాం. రాష్ట్రంలో మలేరియా తగ్గింది. ఉల్లిని నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు అందుబాటులో ఉంచుతాం. ఫైబర్ గ్రిడ్ వినూత్న ప్రాజెక్ట్. దీని కంటెంట్ అందరికి ఉపయోగపడుతోంది. క్లారిటీ ఉంది. ఇప్పటికి 4,85,000 కనెక్షన్లు ఇచ్చారు. అక్టోబరుకు 10 లక్షల కనెక్షన్లు ఇస్తారు. డిసెంబర్ నాటికి కోటి కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం.
 
ప్రభుత్వ ఆస్పత్రులలో ఉత్తమ సేవలు అందజేయడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతోంది. బెడ్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. సీపీఎస్ అన్ని రాష్ట్రాలలో ఉంది. పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి'' అని చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జలసిరి సెప్టెంబరు 17 నుంచి ప్రారంభం... సీఎం చంద్రబాబు