Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చడీ చప్పుడు లేకుండా బాబుగారి బయోపిక్... 80 శాతం అయిపోయిందట....

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తొంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిల బయోపిక్‌లు సైతం చిత్రీకరణ

Advertiesment
చడీ చప్పుడు లేకుండా బాబుగారి బయోపిక్... 80 శాతం అయిపోయిందట....
, శుక్రవారం, 31 ఆగస్టు 2018 (18:56 IST)
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తొంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిల బయోపిక్‌లు సైతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇందులొ చంద్రబాబు నాయుడు బయోపిక్‌ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పైన సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలొనే ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాము. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తిచేశాము. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. భాస్కర్ ఎన్టీఆర్‌గా కన్పిస్తారు. చంద్రబాబు నాయుడు చిన్నతనం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ బయోపిక్‌లో చూపిస్తామన్నారు.
 
నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఈ సెప్టెంబర్ 1కి 23 సంవత్సరాలవుతోంది. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహా నాయకుడి బయోపిక్‌ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
 
వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక, భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశెట్టి, నిర్మాత: జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలర్స్ స్వాతికి పెళ్లైపోయింది.. పైలట్‌ ప్రేమికుడితో డుం.. డుం.. డుం..