చాలామంది మనుషులు అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ అనేక అద్భుతాలు, సాహసాలు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ, కొన్ని జంతువులు కూడా అంగవైకల్యంతో బాధపడుతుంటాయి. అలాంటి జంతువులు కూడా గట్టిపట్టుదలతో ముందుకు సాగుతుంటాయి. ఈ కోవకు చెందినదే ఈ బుజ్జిమేక.
తల్లి కడుపులోని భూమ్మీద పడేసమయానికే ఈ మేకపిల్లకు రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. తల్లిగర్భంలో ఉండగానే ఈ మేకపిల్లకు పక్షవాతం సోకి ముందరి కాళ్లు చచ్చుబడిపోయాయి. దాంతో ఆ యజమాని మేకపిల్ల బ్రతకదని అనుకున్నాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అచ్చం మనిషిలాగానే రెండు కాళ్లతో నడిచేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌లోని రాందిరీ గ్రామంలో ఈ బుజ్జిమేక పిల్ల ఇపుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
తన బుజ్జిమేక పిల్ల బుడిబుడి అడుగులను ఆ యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇపుడు అది వైరల్‌గా మారింది. పైగా, ఈ మేకపిల్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. ఆ వీడియోను మీరూ తిలకించండి.