Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ వివేకాను చంపింది.. వాళ్లేనట..?

Advertiesment
వైఎస్ వివేకాను చంపింది.. వాళ్లేనట..?
, శుక్రవారం, 22 మార్చి 2019 (13:01 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డిని హతమార్చింది.. ఆయన నమ్ముకున్న అనుచరులేనని సిట్ వర్గాల సమాచారం.  ఈ హత్య కేసులో పరమేశ్వర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూత్రధారులు కాగా, చంద్రశేఖర్‌ రెడ్డి అతని గ్యాంగ్‌ ఈ హత్యకు పాల్పడినట్టు సిట్ తేల్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 
 
ఆస్తి వివాదాల కోసమే.. వివేకా నమ్మిన అనుచరులే ఆయనను హతమార్చినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడి అయినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన గురువారం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరు వినియోగించిన ఓ స్కార్పియో వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి వద్ద విచారణ చాలా కీలకమని తెలుస్తోంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఇప్పటికే 40 మందిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హత్య తరువాత గంగిరెడ్డి ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశాడని కూడా సిట్ అధికారులు తేల్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూజర్ల పాస్‌వర్డ్‌లను మా సిబ్బంది దుర్వినియోగం చేయరు.. ఫేస్‌బుక్