Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముందు మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ మార్చండి.. ప్లెయిన్ టెక్ట్స్‌లోనే పాస్‌వర్డులు

ముందు మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ మార్చండి.. ప్లెయిన్ టెక్ట్స్‌లోనే పాస్‌వర్డులు
, శుక్రవారం, 22 మార్చి 2019 (12:09 IST)
సామాజిక మాధ్యమ దిగ్గజం "ఫేస్‌బుక్‌" తన వినియోగదారులకు తాజాగా షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు ఫేస్‌బుక్ తమ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లను ప్లెయిన్‌ టెక్స్ట్‌నే సర్వర్లలో నిక్షిప్తం చేస్తామనీ... కాకపోతే ఈ పాస్‌వర్డ్‌లు ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు తప్ప ఇతరులెవ్వరికీ కనిపించవని స్పష్టం చేసింది. ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలు లేవని ఫేస్‌బుక్‌ ఇంజినీరింగ్‌, భద్రత, గోప్యతా విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనహౌతి తన ‘బ్లాగ్‌స్పాట్‌’లో పేర్కొన్నారు.
 
ఏటేటా జరిపే భద్రతా సమీక్షలో భాగంగా ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని ఆయన నిజాయితీగా అంగీకరించారు. అయితే ఈ తప్పిదాన్ని గుర్తించిన వెంటనే... ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్‌వర్డ్‌లు కలిగి ఉన్న ‘‘ఫేస్‌బుక్‌ లైట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌’’ ఖాతాదారులకు త్వరలోనే ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తామన్నారు. సదరు వినియోగదారులందరూ వీలైతే పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకునేలా సూచిస్తామన్నారు. 
 
కాగా... పై విషయాలను ఫేస్‌బుక్‌ గురువారంనాడు అంగీకరించినప్పటికీ.. ‘క్రెబ్స్‌ఆన్‌సెక్యూరిటీ.కామ్‌’ అనే సెక్యూరిటీ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఈ విషయాన్ని ఇంతకుముందెప్పుడో బయటపెట్టింది. 60 కోట్లమంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లు సాధారణ అక్షరాల్లోనే నిల్వ చేసారనీ, గుప్త అక్షరాల్లో నిక్షిప్తం చేయలేదనీ, 20 వేల మంది ఫేస్‌బుక్‌ ఉద్యోగులు వాటిని చూడగలరని పేర్కొంది. 
 
దీంతో ఫేస్‌బుక్‌ అనుసరించాల్సిన గోప్యతపై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. అయితే... ఇవన్నీ 2012కు ముందు పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు. ఆ తరువాత పాస్‌వర్డ్‌లు మార్చుకున్నవారు, కొత్త ఖాతాలు తెరిచినవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం? బాబుపై కన్నా ఫైర్