24 వేళ్ళతో జన్మించిన మగబిడ్డ

గురువారం, 7 మార్చి 2019 (13:44 IST)
సాధారణంగా ఒక వ్యక్తికి కాళ్లు చేతులకు కలుపుకుని 20 వేళ్లు ఉంటాయి. ఇంకొందరికి చేతికో లేక కాలికో అదనంగా ఆరో వేలు ఉంటుంది. కానీ, తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ శిశువు 24 వేళ్ళతో ఓ శిశువు జన్మించింది. ఆ శిశువును చూసేందుకు ఇరుగుపొరుగువారు క్యూ కడుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన సరోజ అనే మహిళ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆ బిడ్డకు కాళ్లు, చేతులకు కలుపుకుని మొత్తం 24 వేళ్లు ఉన్నాయి. 
 
ప్రతి చేతికి, కాలికి ఆరు వేళ్ల చొప్పున ఉన్నాయి. ఆరు వేళ్లతో పుట్టే పిల్లలకు ఒక వేలు అతుక్కొని ఉంటుంది. కానీ ఈ శిశువుకు మాత్రం ఆరు వేళ్లు విడివిడిగానే ఉన్నాయి. సరోజ దంపతులకు పుట్టిన శిశువును చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హత్యకు ముందు హోటల్ గదిలో ప్రియుడితో ప్రీతి రెడ్డి.. ఏం జరిగిందో?