Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...

Advertiesment
ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (12:55 IST)
బెంగుళూరులో విషాదం జరిగింది. రెండు జెట్ విమానాలు గగనతలంలో ఢీకొట్టాయి. ఎయిరో ఇండియా 2019 షో కోసం రిహార్సల్ చేస్తుండగా బెంగుళూరులోని యెలహంక ఎయిర్‌బేస్‌లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. 
 
ఈ నెల 20న బెంగళూరులో ఎయిరో ఇండియా 2019 ప్రదర్శన ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 20-24 మధ్య జరగనున్న ప్ర‌ద‌ర్శ‌న‌లో అంత‌ర్జాతీయ విమాన‌యాన సంస్థ‌లు త‌మ అత్యాధునిక ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి.
 
ఇందుకోసం పైల‌ట్లు రిహార్స‌ల్స్ చేస్తుండగా, సూర్య‌కిర‌ణ్ ఏయిరోబాటిక్స్ టీమ్‌కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఘ‌ట‌న స‌మ‌యంలో ముగ్గురు పైల‌ట్లు జెట్ విమానాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా పొగమయమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరీష్ రావుకు మొండిచేయి : పాత కొత్త కలయికతో కేసీఆర్ మంత్రివర్గం