Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరీష్ రావుకు మొండిచేయి : పాత కొత్త కలయికతో కేసీఆర్ మంత్రివర్గం

Advertiesment
హరీష్ రావుకు మొండిచేయి : పాత కొత్త కలయికతో కేసీఆర్ మంత్రివర్గం
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (12:47 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. పాత కొత్త ముఖాల కలయికతో ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. కొత్త మంత్రులతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో నలుగురు మంత్రులు రెండోసారి అవకాశం పొందారు. ఆరుగురు మాత్రం తొలిసారి మంత్రివర్గంలో తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 
 
అయితే, ఈ మంత్రివర్గంలోకి సీనియర్ నేత టి. హరీష్ రావును తీసుకోలేదు. దీంతో అంటే హరీష్ రావుకు కేసీఆర్ ఉద్దేశ్యపూర్వకంగానే మొండిచేయి చూపించారనే ఆరోపణలు వస్తున్నాయి. హరీష్‌కు కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించారని కూడా ప్రచారం జరిగింది. వీటిపై హరీష్ రావు స్పందించారు. 
 
తాను ఇప్పుడే కాకుండా ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగిందని, టీఆర్‌ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడి లాంటి కార్యకర్తనని హరీష్ చెప్పారు. పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది తూచాతప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే పదుల సార్లు చెప్పడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ఏర్పాటు చేశారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా కూడా నిర్వర్తిస్తానని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ మంత్రివర్గం విస్తరణ : కొత్త మంత్రులు వీరే...