Publish Date: Fri, 15 Feb 2019 (18:33 IST)
Updated Date: Fri, 15 Feb 2019 (18:42 IST)
నేల ఉసిరి అనే ఈ మొక్క సుమారు 75 సెంటీమీటర్ల వరకు పెరిగే ఏకవార్షిక మొక్క. ఇది సంవత్సరం మొత్తం మీద లభిస్తుంది. దీని ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆకుల చివరిభాగానా చిన్న చిన్న పూసలవలె కాయలు ఉండి అందంగా ఉంటాయి. ఇది కామెర్ల వ్యాధిలో, చర్మరోగాల్లో, మధుమేహం వంటి జబుల్లో ఉపయోగిస్తారు.
1. కామెర్ల వ్యాధిలో ఇది అత్యంత ఉపయుక్తమైన ఔషధంగా అందరికి అందుబాటులో ఉండే మొక్క. దీన్ని సమూలంగా తీసుకుని శుభ్రంగా కడిగి స్వరసాన్ని తీసి 10-20 మి.లీ. ఉదయం త్రాగించిన కామెర్లు తగ్గుతాయి.
2. నేల ఉసిరి, కిరాతతిక్త, కటుక రోహిణి, దామహరిద్రా, తిప్పతీగె, వేపచెక్క మొదలగు వానిని సమాన భాగాలుగా తీసుకుని.. కషాయం లాగా తయారుచేసుకుని 30 మి.లీ. చొప్పున రోజుకు రెండుసార్లు సేవిస్తే ఎలాంటి కామెర్లయిన తగ్గిపోతాయి.
3. నేల ఉసిరి చూర్ణం, ఉత్తరేణి ఆకులరసాన్ని దిరిసెన పట్ట చూర్ణాన్ని సమంగా కలిపి తేనెతో సేవిస్తే క్రిమిరోగాలు తగ్గుతాయి. దీని స్వరసం ప్రమేహవ్యాధులందు ఉపయుక్తంగా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.