Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ఏటీఎం మెషీన్... ఏంటి సంగతి?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (16:48 IST)
బీహార్‌ రాష్ట్రంలోని బోథ్‌గయకు చెందిన ధర్మారణ్య సమీపంలో ఒక కారు అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కారు రోడ్డు మధ్యలో టైరు ఫంక్చరై ఆగిపోయి కనిపించడంతో తీవ్రవాదులు ఎవరైనా ఇలా చేసివుంటారని అనుమానించారు. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కారుని పరిశీలించి దానిలో ఏటిఎం మెషిన్ ఉందని కనుగొన్నారు.
 
కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... అగంతకులు ఏటిఎంని కారులో వేసుకుని వెళుతుండగా టైరు పంక్చర్ కావడంతో జనానికి భయపడి అక్కడే వదిలి వెళ్లి ఉండవచ్చొని అన్నారు. కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా ఈ ఏటిఎం ఘుఘరీటాండ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదిగా గుర్తించారు. 
 
ఇది విష్ణుపథ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉందని, టైరు పేలడంతో జనాలు వచ్చేలోగా కారు వదిలి దుండగులు పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. వారు ఏటిఎంని చోరీ చేసి తరలించడానికి ఉపయోగించిన గ్యాస్‌కట్టర్‌లను కూడా కారులో పోలీసులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకోవడానికి చర్యలను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments