Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడి పొడుస్తోందని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్... అరెస్టయ్యిందా...?

Advertiesment
Police Case
, సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:10 IST)
దేశంలో పోలీసులకు రోజురోజుకీ సరికొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. అసలే అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులతో తలలు పట్టుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన ఒక ఫిర్యాదు పోలీసులను అవాక్కయ్యేలా చేసింది.

మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి‌లో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తమ పొరిగింటి వారి మీద కంప్లైంట్ చేసింది, అయితే వారిలో కోడిని ప్రధాన నిందితులలో చేర్చడం విశేషం. పక్కింట్లో ఉండే కోడి తన కుమార్తెను పదేపదే పొడుస్తోందంటూ పూనమ్ కుష్వాహా అనే మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. 
 
కోడిని కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిందిగా పొరిగింటి వారికి ఎన్నిసార్లు చెప్పినా వారు లెక్క చేయకుండా పెడచెవిన పెట్టారు. చివరకు ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే సరికి పోలీసులు పొరిగింటి వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. కోడి మీద కంప్లైంట్ ఇవ్వడమే కామెడీగా ఉంటే, పక్కింటి వారి సమాధానం అంతకంటే కామెడీగా ఉంది. 
 
అవసరమైతే తమని జైలులో పెట్టండని, అంతేకానీ తమ కోడిని మాత్రం ఏమీ అనకూడదని చెప్పారు. తమకు పిల్లలు లేని కారణంగా ఆ కోడినే కన్నబిడ్డలా చూసుకుంటున్నామని చెప్పారు. ఇరువర్గాల వాదనలను విన్న పోలీసులు రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇక మీదట ఆ కోడిని ఇంట్లోనే కట్టేసి ఉంచాలని ఒప్పందం చేసుకున్నారు. కోడిని యజమానితో పాటు ఇంటికి పంపేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఫోన్‌లో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇక అంతేసంగతులు...