Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

సెల్వి
మంగళవారం, 29 జులై 2025 (21:58 IST)
Baby
కేరళలో దారుణం చోటుచేసుకుంది. కన్నబిడ్డకు అండగా వుండాల్సిన తండ్రే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కుమార్తె గర్భం దాల్చింది. ఈ ఘటనలో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళ, కాసర్‌గోడ్ జిల్లాలో మంగళవారం 48 ఏళ్ల వ్యక్తి తన 15 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె గర్భవతికి దారితీసినందుకు అరెస్టు చేసినట్లు హోస్‌దుర్గ్ పోలీసులు తెలిపారు. 
 
పదవ తరగతి చదువుతున్న బాలిక జూలై 23న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కన్నతండ్రి కిరాతకుడని తేలింది.  ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం కావడంతో బాలిక, నవజాత శిశువును కన్హాంగడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి అధికారులు వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు.
 
ఈ క్రమంలో గల్ఫ్‌లో ఉన్న నిందితుడిని రాష్ట్రానికి తీసుకువచ్చారు. విచారణలో, అతను తన కుమార్తెను లైంగికంగా వేధించినట్లు అంగీకరించాడు. ఇంతలో, తండ్రి, బాలిక ఇద్దరి DNA నమూనాలను పరీక్ష కోసం పంపారు. మద్యం మత్తులో తన కుమార్తెను లైంగికంగా వేధించానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. 
 
తన తండ్రి వేధింపులను వెల్లడిస్తూ బాలిక పోలీసులకు చెప్పగా, తల్లి గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని పేర్కొంది. వైద్య సంరక్షణ తర్వాత బాలికను డిశ్చార్జ్ చేశారు. నవజాత శిశువు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం