తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నల్గొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు... తక్షణం స్పందించి మంటలను ఆర్పివేసి బాధితుడుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
నల్గొండ జిల్లా కేంద్రంలో నరసింహా అనే వ్యక్తి తప్పతాగి ఇంటికి వెళుతున్న క్రమంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపైనే కేసు నమోదుచేస్తారా అంటూ శరీరంపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు హుటాహుటిన స్పందించి మంటలను ఆర్పివేశారు. మంటలు ఆర్పే క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలు కూడా అయ్యాయి. నరసింహను సమీపంలోని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.