మహిళలకు రోడ్డుపై నడవడానికి రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికే ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతున్న వేళ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది.
వివరాల్లోకి వెళితే... కర్ణాటక - మంగళూరులో తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో ఢీకొని హత్యాయత్నం చేశాడు.. సతీశ్ అనే వ్యక్తి. కానీ మురళిని ఢీకొడుతున్న సమయంలో అటు వైపు నడిచి వెళ్తున్న మహిళను కూడా కారుతో సతీష్ ఢీకొట్టాడు. కారు ఢీకొనడంతో ఓ ఇంటి గోడకు తలకిందులుగా ఆ మహిళ వేలాడింది.
ఈ ఘటనలో మురళితో పాటు ఆ మహిళకు కూడా గాయాలైనాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆ మహిళను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో గతంలో మురళి తండ్రిపైన కూడా హత్యాయత్నానికి సతీష్ పాల్పడ్డాడని తెలిసింది.
ఇంకా సతీష్- మురళీల మధ్య వివాదానికి కారణం ఏంటి..? హత్యాయత్నం చేసేంతలా వీరి మధ్య ఏం జరిగిందనే వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు.