తన కన్యత్వాన్ని వేలంపాటలో పెట్టి కోట్ల రూపాయలు గడించింది ఓ యువతి. తన లైఫ్ సెటిల్ చేసుకునేందుకు ఇలాంటి వేలంపాటను ఆ యువతి ఓ వెబ్ సైటులో ప్రకటించింది. కన్యత్వాన్ని అప్పగిస్తానంటూ ఆమె చేసిన ప్రకటనను చూసి ఆమెను దక్కించుకునేందుకు కోటీశ్వరులు సైతం వేలంవెర్రిగా ఎగబడ్డారు. చివరికి రూ. 18 కోట్లకు ఓ నటుడు ఆమె కన్యత్వాన్ని వశం చేసుకున్నాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన యూకేలో జరిగింది.
పూర్తి వివరాలు పరిశీలిస్తే... ఇంగ్లాండులోని మాంచెస్టర్‌కి చెందిన 22 ఏళ్ల యువతి లారా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్ సైటులో ప్రకటన ఇచ్చింది. అంతే... ఆమెను దక్కించుకునేందుకు రాజకీయ నాయకుల దగ్గర్నుంచి బడా వ్యాపారవేత్తలు, హాలీవుడ్ స్టార్స్ సైతం పోటీపడ్డారు. ఈ పోటీలో ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో రూ. 18 కోట్లకు ఆమెను దక్కించుకున్నాడు.
వేలంపాట పూర్తి కాగానే లారా తన కన్యత్వాన్ని నిర్థారించేందుకు ఆసుపత్రిలో నటుడి సమక్షంలో కన్యత్వ పరీక్షలు చేసి తను కన్య అని నిర్థారించుకుంది. అనంతరం అతడు లారాను తన వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లిపోయాడు. కాగా తన కన్యత్వాన్ని అమ్ముకోవడాన్ని లారా సమర్థించుకున్నది. తనకు వచ్చిన రూ. 18 కోట్లతో తన జీవితం స్థిరపడుతుందనీ, ఐతే కొంతమంది అమ్మాయిలు అమాయకంగా తమ కన్యత్వాలను కోల్పోతున్నారంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లారా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.