ఏదయినా రాజకీయ వేడుక లేదా పండుగ వస్తుందంటే ఉత్సవం పేరుతో కొంతమంది చేస్తున్న కార్యక్రమాలు అసభ్యకరంగా వుంటున్నాయి. వేలమంది ప్రజలు చూస్తున్నారనే సంగతి కూడా మర్చిపోయి బహిరంగంగానే వివిధ రీతుల్లో నృత్యభంగిమలను చేయిస్తున్నారు నిర్వాహకులు. కాసులకు కక్కుర్తి పడి యువతులు కూడా వారు చెప్పినట్లే చేసేస్తున్నారు.
వంగవీటి మోహన రంగా ఫోటోతో వున్న స్టేజిపైన ఓ యువతి అసభ్యకర రీతిలో నృత్యం చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె కుర్చీ పైన చేతులు వేసి ఊపుతూ చేస్తున్న భంగిమలను అక్కడ వేలమంది యువకులు చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇలాంటి నృత్యాలను బహిరంగంగా చేయడాన్ని ఎలా అనుమతిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారుతోంది.