గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో ఒక దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడంతో అతనిని ఆ కుటుంబ సభ్యులు నగ్నంగా ఊరేగించారని పోలీసులు తెలిపారు.
మార్చి 11 రాత్రి ఇదార్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, 20 ఏళ్ల వ్యక్తి నగ్నంగా నడుస్తూ ఉండగా, ఒక గుంపు అతనిపై వేధింపులు, దాడికి పాల్పడుతున్నట్లు కనిపిస్తుంది.
వైరల్ వీడియో ఆధారంగా, ఆ మహిళ భర్త, ఇతర బంధువులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్న ఆ వ్యక్తిని హిమ్మత్ నగర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇదార్ పట్టణంలోని అతని ఇంటి నుండి కిడ్నాప్ చేసి, కొట్టి, నగ్నంగా ఊరేగించారు. క్షమాపణ లేఖపై సంతకం చేసిన తర్వాతే వారు అతన్ని వదిలిపెట్టారు" అని సబర్కాంత పోలీసు సూపరింటెండెంట్ విజయ్ పటేల్ తెలిపారు.
దీనిపై కేసు నమోదైంది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత SC/SC (అత్యాచారాల నివారణ) చట్టం కింద అపహరణ, దాడి, ఇతర నేరాల కింద అభియోగాలు మోపారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని అని ఎస్పీ తెలిపారు.