పక్కింటితో గొడవ, మూత్రం తాగించారు, ఆత్మహత్య చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (12:07 IST)
మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పక్కింటి వారితో ఏర్పడిన జగడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పక్కనే వున్న కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా బలవంతంగా మూత్రం తాగించడంతో.. ఆ అవమానం తాళలేక మధ్యప్రదేశ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ శివపురి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వికాశ్‌ శర్మ అనే వ్యక్తి తాగునీరు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే కుటుంబంతో వికాశ్‌ శర్మకు గొడవ జరిగింది. దీంతో శర్మను తీవ్రంగా చితకబాది, బలవంతంగా మూత్రం తాగించారు.
 
ఈ అవమానాన్ని తట్టుకోలేని శర్మ.. తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకా అక్కడ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. పక్కింట్లో ఉన్న మనోజ్‌ కోలి, తారావతి కోలి, ప్రియాంక కోలి కలిసి తనను కొట్టారని, మూత్రం తాగించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో శర్మ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

శర్మ హత్య కేసులో నిందితులైన మనోజ్‌, తారావతి, ప్రియాంకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు కుటుంబాల మధ్య గత ఏడాదిన్నర కాలం నుంచి వివాదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments