Publish Date: Thu, 07 May 2020 (17:28 IST)
Updated Date: Thu, 07 May 2020 (17:37 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కరోనా వైరస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే ఇండోర్ పట్టణం అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ విషయాన్ని ఇండోర్ (ఈస్ట్) ఎస్పీ మహ్మద్ యూసఫ్ ఖురేషీ తెలిపారు. వారిలో 22 మంది వేర్వేరు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని, మరో ఎనిమిది మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు.
మరోవైపు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3049 కరోనా కేసులు నమోదు కాగా 176 మంది చనిపోయారు. ఇకపోతే, దేశంలో మొత్తం 52952 మందికి ఈ వైరస్ సోకింది. 1783 మంది చనిపోగా, 15267 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.