మధ్యప్రదేశ్ గ్వాలియర్ నగరంలోని సెంట్రల్ జైలులో 25 ఏళ్ల హత్య నేరస్థుడు స్పూనుతో తన మర్మాంగాన్ని కత్తిరించుకున్నాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఒక గుడి ఉంది. అక్కడ జైలులోని ఖైదీలు నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. మంగళవారం కూడా ఖైదీలు ప్రార్థనలు చేస్తుండగా.. ఒక నేరస్థుడు ఒక్కసారిగా లేచి నిలబడి స్పూన్‌తో తన జననాంగాన్ని కత్తిరించుకున్నాడు.
‘మే 5న గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న దోషుల్లో ఒకరు జైలు ప్రాంగణంలోని ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నాడు. అతను అకస్మాత్తుగా లేచి నిలబడి హవాన్ కోసం ఉపయోగించే చెంచాతో తన మర్మాంగాలను కత్తిరించుకున్నాడు.
ఆ ఖైదీ 2018 నుంచి జైలులో ఖైదీగా ఉన్నాడని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుందని ప్రభాత్ కుమార్ వెల్లడించారు.
పోలీసుల విచారణలో, కుమార్ అనే పేరున్న ఆ ఖైదీ తన ప్రైవేట్ భాగాలను ఆలయంలో సమర్పించమని శివుడు కోరినట్లు కలలు కన్నానని పేర్కొన్నాడు.