Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేతబడి చేశారని ముగ్గురు మహిళలతో మూత్రం తాగించి..?

Advertiesment
చేతబడి చేశారని ముగ్గురు మహిళలతో మూత్రం తాగించి..?
, మంగళవారం, 5 మే 2020 (17:05 IST)
అసలే కరోనా కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమై వున్నారు. అయినా మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే వున్నాయి. తాడాగా చేతబడి చేస్తారనే ప్రచారంతో ముగ్గురిపై మంత్రగత్తెలుగా ముద్ర వేశారు. అంతటితో ఆగకుండా మహిళల చేత మూత్రం తాగించడం, గుండు గీయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ సంఘటన బీహార్‌లోని ముజఫర్‌ జిల్లా దాక్‌రామా గ్రామంలో చోటుచేసుకుంది.
 
రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ వీడియోను ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్‌జేడీ) సైతం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనకు కారణమైన 10 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో తొమ్మిదిమందిని నేడు అరెస్ట్‌ చేసినట్లుగా ఏఎస్పీ అమితేష్‌ కుమార్‌ తెలిపారు. కాగా మహిళలకు గుండ్లు కొట్టిన వ్యక్తి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో కిక్కుకి పరాకాష్ట - లిక్కరు బిల్లు రూ.95,347