Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ మనవరాలికి ఇష్టం లేని పెళ్లి.. ఆపిన తాతయ్య.. రాయిని తలపై మోది..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (15:53 IST)
మనవరాలికి ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న తాత ఆ పెళ్లిని ఆపేశాడు. మైనర్ మనువరాలికి ఇష్టం లేని పెళ్లి ఎందుకు అంటూ ప్రశ్నించాడు. అంతే కోపంతో ఊగిపోయిన కొడుకు.. తండ్రినే హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురం సమీపంలోని కరేనిహళ్లికి చెందిన నివాసి కుమార్ తన 15ఏళ్ల కుమార్తె పుష్పకు స్థానిక సుబ్రహ్మణ్య కుమారుడు బాబుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. కానీ ఆ వివాహం పుష్పకు ఇష్టం లేదు. పై చదువులు చదువుకోవాలని ఆశపడింది. కుటుంబసభ్యులకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. తాతయ్య (ఈశ్వరప్ప)తో ఈ వివరాలన్నీ చెప్పింది. 
 
ఇక మనవరాలి సంతోషమే ముఖ్యంగా భావించిన తాతయ్య పెళ్లి రోజు మహిళా-శిశు అభివృద్ధి శాఖ అధికారులకు ఫోన్ చేసి మైనర్ బాలికకు వివాహం జరుగుతుందని వచ్చి.. ఆమెను రక్షించాలని కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వివాహ వేదిక వద్దకు చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. కానీ ఈ పెళ్లి ఆగిపోయిన కోపంతో.. బాలిక తండ్రి, వరుడి తండ్రి... ఈశ్వరప్పతో గొడవకు దిగారు.
 
ఈ గొడవ పెద్ద వాగ్వివాదానికి కారణమైంది. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన వారిద్దరూ బండరాయితో తలపై మోది పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరప్పను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈశ్వరప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments