Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండున్నరేళ్ళ వయసు.. చనిపోతూ.. ఐదుగురికి ప్రాణం పోశాడు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (10:42 IST)
రెండున్నరేళ్ళ వయసులోనే తాను చనిపోతూ ఐదుగురి ప్రాణాలను కాపాడాడు ఓ చిన్నారి. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌లో సంజీవ్ ఓజా అనే వ్యక్తి తన భార్య, కొడుకు జాష్తో జీవిస్తున్నారు. ప్రతిరోజూలానే డిసెంబర్ 9న కూడా చిన్నారి జాష్ బాల్కనీలో ఆడుకుంటున్నాడు. అతడి తల్లి ఏదో పనిలో నిమగ్నమై ఉంది. ఇంతలో బాల్కనీలో ఆడుకుంటున్న జాష్ కిందపడిపోయాడు. 
 
పెద్ద శబ్ధం విని రక్తపు మడుగులో ఉన్న కొడుకును తీసుకుని వెంటనే ఆస్పత్రికి పరిగెత్తింది ఆ తల్లి. ఐదు రోజుల పాటు వైద్యులు జాష్‌కు చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోయింది. డిసెంబర్ 14న జాష్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. దీంతో జాష్ తల్లిదండ్రులకు షాక్ తప్పలేదు. అయితే ఈ సమయంలోనూ ఓజా దంపతులు గుండె రాయి చేసుకుని ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ బిడ్డ అవయవాలతో ఇతరుల ప్రాణాలు కాపాడాలని అనుకున్నారు. తమ కొడుకు అవయవాలను ఇతరులకు డొనేట్ చేసేందుకు తల్లిదండ్రులిద్దరూ అంగీకరించడంతో ఓజా ఊపిరితిత్తులు, గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయాన్ని అవసరం ఉన్న పేషంట్లకు వైద్యులు వెంటనే పంపించారు. ఓజా గుండె, ఊపిరితిత్తులను 3 గంటల వ్యవధిలోనే విమానం ద్వారా చెన్నైకి తరలించారు.  
 
ఓజా రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ 13 ఏళ్ల బాలికకు అమర్చగా.. మరో కిడ్నీ సూరత్‌కు చెందిన 17 ఏళ్ల మరో బాలికకు అందించారు. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగేళ్ల బిడ్డకు ఓజా ఊపిరితిత్తులను వినియోగించారు. నవ్వుతూ కళ్ళముందు తిరుగాడిన బిడ్డ చనిపోయాడన్న బాధలోనూ వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అంటూ వైద్యులు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments