చెడు తిరుగుళ్లు తిరిగే భర్త నుంచి హెర్పిస్ వ్యాధి సోకింది... ఏం చేయను?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (10:16 IST)
కట్టుకున్న భర్తపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెడు తిరుగుళ్లు తిరిగే తన భర్త నుంచి తనకు హెర్పిస్ వ్యాధి (లైంగిక సంక్రమణ వ్యాధి) సోకిందని అందులో పేర్కొంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే తనను పట్టుకుని కొడుతూ చిత్రహింసలు పెడుతున్నాడని పేర్కొంది. 
 
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్ నగరంలోని వెజల్ పూర్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల వివాహిత లాక్డౌన్ సమయంలో తన భర్త నుంచి హెర్పిస్ వ్యాధి సోకిందని ఆరోపించారు. 
 
2017 మేలో మేనెక్ బాగ్ నివాసిని తాను వివాహమాడానని, అతను తాగుబోతు అని, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తన భర్త శరీరంపై పుండ్లు ఉన్నాయని, ఆయన నుంచి తనకు లైంగిక సంక్రమణ వ్యాధి అయిన హెర్పిస్ సోకిందని మహిళ ఆరోపించింది. దీనిపై ప్రశ్నిస్తే భర్త తనను కొట్టి పుట్టింట్లో వదిలేశారని వివాహిత పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం