Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేట కేసులో సల్మాన్‌కు ఊరట.. అందరూ రావాల్సిందే

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:23 IST)
దాదాపు 20 సంవత్సరాలుగా నలుగుతున్న రాజస్థాన్ కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఈ కేసు తీర్పును రాజస్థాన్ హైకోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చేసిన అప్పీల్‌పై విచారణ జరుగుతోంది. నిజానికి ఏప్రిల్ 4వ తేదీనే ఈ తీర్పు వెల్లడించాల్సి ఉంది, కానీ న్యాయస్థానం దీనిని వాయిదా వేస్తూ ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతీ ఒక్కరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
 
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు జోధ్‌పూర్ దగ్గర్లో ఉన్న కంకణి ప్రాంతంలో కృష్ణ జింకలను బాలీవుడ్ కండల వీరుడు వేటాడినట్లు ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటుగా సైఫ్ ఆలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలి బింద్రే కూడా నిందుతులుగా ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 51, 149 క్రింద కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఒక రోజు శిక్ష అనంతరం బెయిల్‌పై సల్మాన్ బయటకు వచ్చి, ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments