Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్మాతకు డబ్బులు ఎగ్గొట్టి చిక్కుల్లో పడిన అమీషా పటేల్...

నిర్మాతకు డబ్బులు ఎగ్గొట్టి చిక్కుల్లో పడిన అమీషా పటేల్...
, శనివారం, 30 మార్చి 2019 (09:34 IST)
నిర్మాతకు చెల్లించాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన బాలీవుడ్ నటి అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. నిర్మాత అజయ్ కుమార్‌కు ఈమె కొంత నగదు ఇవ్వాల్సి వుంది. ఇందుకోసం చెక్‌ ఇచ్చింది. కానీ, బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. అలా ఆయన్ను మోసం చేసింది. దీంతో అజయ్ కుమార్ రాంచీ కోర్టులో ఫిర్యాదు చేశారు. 
 
గత యేడాది మార్చిలో రాంచీలో ఓ ఈవెంట్‌కి హాజరైన అమీషా పటేల్, ఆమె బిజినెస్ పార్టనర్ కున్నాల్ గ్రూమర్ తన దగ్గర రూ.2.5 కోట్లు అప్పుగా తీసుకుందని నిర్మాత అజయ్ కుమార్ తెలిపారు. రెండు, మూడు నెలల్లో వడ్డీతో కలిపి చెల్లిస్తామని చెప్పారని హామీ ఇచ్చారు.
 
ఆ తర్వాత 3 కోట్ల రూపాయల చెల్లని చెక్ ఇచ్చారని తెలిపారు. ఆ పిమ్మట వారిని సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని పేర్కొన్నారు. పైగా, పెద్దపెద్ద బడా నేతల ఫోటోలు చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘అవెంజర్స్’ ఫ్యాన్స్‌కి సూపర్ సర్‌ఫ్రైజ్