వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసుపై రాజకీయ నేతలు మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు తరఫున అండర్ టేకింగ్ ఇవ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ)ను హైకోర్టు ఆదేశించింది. కాగా జగన్ తరపున న్యాయవాదులు అండర్ టేకింగ్ ఇచ్చారు.
కాగా దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వ ప్రమేయం లేని దర్యాప్తు సంస్ధతో విచారణ జరపాలంటూ ప్రతిపక్షనేత జగన్‌తో పాటు వివేకానంద సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థకు కేసు విచారణ అప్పగించాలని కోరిన సంగతి తెలిసిందే.