Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రం కుట్రలు : రైతు సంఘాల నేతల ఆరోపణ

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (17:18 IST)
దేశ రాజధాని నగరంలోని ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాలను అణచివేసేందుకు రైల్వేశాఖ పలు రైలు సర్వీసులను రద్దు చేయడం, దారి మళ్లించడం చేస్తుందని రైతు సంఘాల నేతలు ఆరోపించాయి. ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రైతులు వస్తున్న రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లించడం, రైలు సర్వీసులను రద్దు చేయడం చేస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ కొక్రికలాన్ ఆరోపించారు. 
 
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోని భటిండా, మాన్సా, ఫిరోజ్ పూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి వస్తుండగా రైళ్లను సరిహద్దుల్లోనే నిలిపివేశారని సుఖ్ దేవ్ సింగ్ చెప్పారు. రైళ్లను రద్దు చేయడం, దారిమళ్లించటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
 
రైతులు ఆందోళనను కొనసాగించేందుకు ట్రాక్టర్లు, బస్సులు,ట్రాలీలు, టెంపోల్లో తరలివస్తున్నారని కొక్రికలాన్ వివరించారు.వెయ్యిమంది రైతులు రైలులో ఢిల్లీకి వస్తుండగా టిక్రి సరిహద్దుకు నాలుగుకిలోమీటర్ల దూరంలోని బహదూర్ ఘడ్ వద్ద దించివేశారని చెప్పారు. 
 
గంగానగర్ - ఓల్డ్ ఢిల్లీ రైలును కూడా బహదూర్‌గఢ్ వద్ద నిలిపివేశారు. ముంబై సెంట్రల్ నుంచి వచ్చే అమృత్ సర్ స్పెషల్ రైలును జనవరి 13 నుంచి దారి మళ్లించారు. దర్బంగా - అమృత్ సర్ స్పెషల్ రైలు కూడా రద్దు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments