Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాగు చట్టాలను నిలుపుదల చేస్తారా? మమ్మల్ని చేయమంటారా? సుప్రీం ప్రశ్న

Advertiesment
సాగు చట్టాలను నిలుపుదల చేస్తారా? మమ్మల్ని చేయమంటారా? సుప్రీం ప్రశ్న
, సోమవారం, 11 జనవరి 2021 (15:42 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నాలు. ఎముకలు కొరికే చలిలో రైతులు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటున్నారు. ఇందులో మహిళలు, వృద్ధులు కూడా పాల్గొంటున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏం జరుగుతోంది అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. 
 
'నూతన చట్టాలను మీరు నిలుపుదల చేస్తారా? లేదంటే మమ్మల్ని చేయమంటారా? ఇందులో అహం ఎందుకు? ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మా చేతులకు రక్తం అంటుకోవాలని మేం భావించడం లేదు. ఆందోళనల్లో పాల్గొన్న కొంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా పాల్గొంటున్నారు. అసలు ఏం జరుగుతోంది?' అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్త ఎస్.ఏ.బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. 
 
చట్టాలను రద్దు చేయమని తాము అనడం లేదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని సుప్రీం స్పష్టం చేసింది. అయితే చట్టాల్ని కొంత కాలం నిలిపేయగలరా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందని, అందుకే సోమవారం తామే ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం రైతుల ఆందోళనకు పూర్తి బాధ్యత కేంద్రమే వహించాలని పేర్కొంది. చట్టాలను కేంద్రమే తీసుకొచ్చిందని, దానిని సరైన పద్ధతిలో అమలు చేసే బాధ్యత కూడా కేంద్రానిదే అని సుప్రీం స్పష్టం చేసింది. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియపై తాము అసంతృప్తిగా ఉన్నామని, కేంద్రం నిర్వహిస్తున్న చర్చల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తి సురేష్ ఏమైంది? సన్నగా బక్కచిక్కిపోయి అందవిహీనంగా?