Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య-నేపాల్-లంకలో పెట్రోల్, డీజిల్ రేట్లు.. స్వామి వ్యంగ్యంగా ట్వీట్

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (16:57 IST)
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దేశంలో పెట్రోల్, డీజిల్‌ రేట్లకు సంబంధించి ఓ వ్యంగ్యంగా ఫొటోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అందులో.. ‘రామ జన్మభూమిగా పిలువబడే ఇండియాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93 ఉండగా, సీతమ్మవారు పుట్టిన దేశమైన నేపాల్‌లో పెట్రోల్‌ లీటర్‌కు రూ. 53 ఉంది. అయితే రావణుడి జన్మస్థలమైన లంకలో కేవలం లీటర్‌ రూ. 51 మాత్రమే’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇండియాలో ఇంధనం ధరలు పెరిగినప్పుటి నుంచి ఈ ఎంపీ ట్విట్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.
 
రోజురోజుకు పెరుగుతున్న ఇంధనాల ధరలతో సామాన్యుడితో పాటు, ధనికులు కూడా బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనాతో అతాలకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుపై ప్రతిపక్షాలతో పాటు బీజేపీ నేతలు కూడా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.
 
ఇప్పటికే కొన్ని చోట్ల పెట్రోల్‌ ధరలు సెంచరీలో అడుగు పెట్టాయి. క్రమంలో కేంద్రం, బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌ మీద వ్యవసాయ సెస్‌ విధిస్తున్నుట్లు ప్రకటించగా ..ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ సెస్‌ను సుంకం నుంచి మినహాయించి వినియోగదారులపై ఈ భారం మోపమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments