Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి భద్రత పెంపు.. స్మార్ట్ నిఘా వ్యవస్థ.. నేరగాళ్లకు చుక్కలే..

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (10:40 IST)
వారణాసిలో భద్రత మరింత పెరగనుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తున్న వారాణాసి నగరంలో స్మార్ట్ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో నేరగాళ్ల సంచారంపై నిఘా పెరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గ కేంద్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో 3వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 
 
అధునాతన భారతీయ, యూరోపియన్, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వారణాసి స్మార్ట్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ తెలిపారు. 
 
అవసరమైతే ముఖ గుర్తింపు కెమెరాల సంఖ్యను పెంచుతామని ఆయన చెప్పారు. 720 ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానించారు. రూ.128 కోట్లతో ఆప్టికల్ ఫైబర్ లైన్ వేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
 
ముఖ గుర్తింపు కెమెరాలు నేరస్థులను సులభంగా పట్టుకుంటాయని కమిషనర్ చెప్పారు. వాంటెడ్ క్రిమినల్‌ను ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలో బంధిస్తే, అది కెఐసిసిసి వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వారు సంబంధిత పోలీస్ స్టేషనుకు తెలియజేస్తారు. దీంతో పోలీసులు వచ్చి నేరస్థుడిని అరెస్టు చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments