Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో విమానాశ్రయం.. శ్రీరాముడి పేరు పెట్టనున్నారు..

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (10:33 IST)
శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించింది.

అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని, యూపీలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా ఉండవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ 2018 నవంబర్‌లో దీపావళి సందర్భంగా దీపాత్సవ్ సందర్భంగా ప్రకటించారు. 
 
అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడాన్ని పలువురు సాధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ యూపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 
 
ఇంకా అయోధ్య విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ విమానాశ్రయంగా మారుస్తూ మంత్రివర్గం తాజాగా తీర్మానించింది. టెంపుల్ టౌన్ అయోధ్యలోని విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ మంత్రివర్గం నిర్ణయించింది. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ప్రారంభమైంది. భూసేకరణ పూర్తి కాగానే కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments