Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ.. కొన్ని దేశాలు ఇంటి దొంగ వంటివి..?

Advertiesment
పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ.. కొన్ని దేశాలు ఇంటి దొంగ వంటివి..?
, మంగళవారం, 17 నవంబరు 2020 (20:05 IST)
narendra modi
బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్‌పైనా, అంతర్జాతీయ వ్యవస్థల తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గర్జించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలను సంస్కరించాలని కోరారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదం ప్రపంచంలో అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే, నిధులు సమకూర్చే అన్ని దేశాలను జవాబుదారీ చేయాలన్నారు. మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారు.
 
12వ బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, మల్టీలేటరలిజం సంక్షోభంలో ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు 75 ఏళ్ల క్రితంనాటి ఆలోచనా ధోరణితో నడుస్తున్నాయని, కాలానుగుణంగా మారడం లేదని అన్నారు.
 
పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదమని తెలిపారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే, సహాయపడే దేశాలను కూడా అపరాధులుగా ప్రకటించాలన్నారు. బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీని ఖరారు చేయడం గొప్ప విజయమని తెలిపారు. 
 
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారు. కొన్ని దేశాలు ఇంటి దొంగ వంటివన్నారు. ఉగ్రవాదం, కోవిడ్-19 మహమ్మారి వంటి సమస్యల పట్ల ప్రపంచం అలసత్వంతో వ్యవహరించకూడదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది.. అధికార మార్పిడి ఆటలు కాదు.. మిచెల్