Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది.. అధికార మార్పిడి ఆటలు కాదు.. మిచెల్

అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది.. అధికార మార్పిడి ఆటలు కాదు.. మిచెల్
, మంగళవారం, 17 నవంబరు 2020 (19:33 IST)
Michelle Obama
అమెరికాలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే వుంది. అమెరికా అధినేత ట్రంప్ తీరును డెమోక్రాట్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ హూందాగా అధికార మార్పిడికి సహకరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ, బరాక్‌ ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. 
 
అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించడం లేదు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టుల్లో దావాలు వేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యవహారంపై మిచెల్ ఒబామా స్పందించారు. 'అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది' అని వ్యాఖ్యానించారు. 'డెమొక్రాట్లను ఓడించి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చాలా బాధపడ్డా. 
 
కానీ అప్పట్లో అమెరికన్‌ ఓటర్లు ట్రంప్‌నకు పట్టం గట్టడంతో ఓటమిని అంగీకరించి, అధికార మార్పిడికి సహకరించాం. ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడి జరగడం అమెరికా ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుంది' అని మిచెల్‌ ఒబామా పేర్కొన్నారు.
 
అధ్యక్షుడు ట్రంప్‌ ఓటమిని అంగీకరించక పోవడంతో అమెరికాలో అధికార మార్పిడి ఇంకా ప్రారంభం కాలేదని, ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉందని మిచెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. అధికార మార్పిడి అనేది ఇది ఆట కాదని, ట్రంప్ తీరు అమెరికా రాజకీయాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని మిచెల్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్‌కు వినతి