Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ షరతు ... యేడాదికి రూ.50 వేలు ఇవ్వాల్సిందే..

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (12:29 IST)
సొంత పార్టీకి చెందిన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఓ షరతు విధించింది. ప్రతి యేడాది రూ.50 వేల చొప్పున పార్టీకి విరాళాలు ఇవ్వాల్సిదేనంటూ కండిషన్ పెట్టింది. అంతేకాకుండా, పార్టీపై అభిమానం ఉన్న కనీసం ఇద్దరి నుంచి యేటా రూ.4 వేలు విరాళంగా సేకరించాలని కోరింది. అలాగే, ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌ని పార్టీ స‌భ్యుల‌కు సూచించింది. 
 
దేశంలో 135 ఏళ్ల చ‌రిత్ర గ‌ల కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం నిధులు లేక ఇబ్బంది ప‌డుతుంది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన విరాళాలు బాగా తగ్గాయి. 2018-19లో రూ.383 కోట్ల మేర ఎన్నిక‌ల బాండ్లు రాగా.. 2019-20లో రూ.318 కోట్లు వ‌చ్చాయి. 
 
ఈ నేప‌థ్యంలో పార్టీ నిధుల సేక‌ర‌ణ పొదుపు చ‌ర్య‌ల‌పై దృష్టి సారించింది. పార్టీ కోశాధికారి ప‌వ‌న్ బ‌న్సాల్ పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు లేఖ‌ల ద్వారా ఈ విష‌యం తెలియజేశారు.
 
పార్టీలోని ప్ర‌తి స‌భ్యుడు తమ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాల‌ని సూచించారు. కొందరు ఎంపీలు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా ఉన్నారు. వారికి ప్ర‌భుత్వం నుంచి ల‌భించే విమాన సౌక‌ర్యాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించింది. 
 
ఇక‌పై కార్య‌ద‌ర్శులుగా ఉన్న‌వారికి 14,000 కి.మీ లోపు రైలులోనే ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. అది దాటితే త‌క్కువ శ్రేణి విమాన చార్జీలు చెల్లిస్తామ‌ని వెల్లడించారు. అది కూడా నెల‌కు రెండు సార్లు.. విమాన చార్జీలు రైలు టికెట్ క‌న్నా త‌క్కువ ఉంటేనే చెల్లిస్తామ‌న్నారు. 
 
అలాగే, ఇక‌మీద ప్ర‌తీ ఎంపీ ఏటా రూ.50,000 విరాళం ఇవ్వాల‌ని అంతే కాకుండా పార్టీపై అభిమానం ఉన్న క‌నీసం ఇద్ద‌రి వ‌ద్ద నుంచి ఏటా రూ.4,000 విరాళం సేక‌రించాల‌ని సూచించింది. కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంటే బీజేపీ విరాళాలు ఏడాదిలో రూ.1,450కోట్ల నుంచి రూ.2,555 కోట్ల‌కు పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments