17 ఏళ్ల బాలుడిని అపహరించిన చైనా సైనికులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:02 IST)
డ్రాగన్ కంట్రీ మరోసారి సరిహద్దుల్లో దుశ్చర్యకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన 17ఏళ్ల బాలుడు మిరమ్ తరోన్ ను చైనా సైనికులు అపహరించి తీసుకుపోయారు. ఈ విషయాన్ని రాష్ట్రానికి చెందిన ఎంపీ తపిర్ గావో ట్వీట్ చేశారు. 
 
మిరమ్ తరోన్‌ను అపహరించుకుపోయే క్రమంలో అతడి స్నేహితుడు జానీ యాయింగ్ సైతం పక్కనే ఉన్నాడు. కాకపోతే అతడు చైనా సైనికుల నుంచి తెలివిగా తప్పించుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. 
 
బాలుడ్ని భారత ప్రాదేశిక ప్రాంతమైన లుంగ్తాజోర్ నుంచి మంగళవారం తీసుకువెళ్లినట్టు తపిర్ గావో ప్రకటించారు. ఈ ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల రహదారిని అక్రమంగా నిర్మించింది.
 
అతడ్ని వెంటనే విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్‌ను కోరినట్టు ఎంపీ తెలిపారు. తన ట్వీట్లను ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, రక్షణ మంత్రులకు ట్యాగ్ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments