Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్న గొడవకు.. పెంపుడు కుక్కను ఉసిగొల్పారు.. ఎక్కడ?

చిన్న గొడవకు.. పెంపుడు కుక్కను ఉసిగొల్పారు.. ఎక్కడ?
, బుధవారం, 19 జనవరి 2022 (14:56 IST)
మైనర్‌ బాలుడి కుటుంబంతో ఏర్పడిన చిన్న వాగ్వాదానికి కోపంతో రగలిపోయి పెంపుడు కుక్కను ఉసుగొలిపి అమానుష చర్యకు ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా సదోపూర్ గ్రామంలో పిట్ బుల్ కుక్క యజమానులు చూస్తుండగానే ఓ చిన్నారిపై దాడి చేసింది. అయితే ఆ మైనర్‌ బాలుడి కుటుంబంతో ఆ కుక్క యజమానులకు చిన్న వాగ్వాదం జరిగింది.
 
దీంతో కుక్క యజమానులైన రవీందర్‌, సౌరభ్‌లు వారి పెంపుడు కుక్క బుల్‌ని మైనర్‌ బాలుడి పైకి ఉసుగొల్పారు. అయితే స్థానికులు ఆ కుక్క బెదరగొట్టడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఆ కుక్క యజమానులు మాత్రం జోక్యం చేసుకోకుండా అత్యంత పాశవికంగా నుంచుని చూశారు. 
 
పాపం ఆ కుక్క దాడిలో ఆ చిన్నారికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2022-23 వార్షిక బడ్జెట్ : మధ్యతరగతిపై వరాల జల్లు?