Sonu Sood, Micro-Blogging Site
సోనూసూద్ గురించి తెలియని భారతీయుడు వుండడు. విలన్‌గా పలు సినిమాలు చేసినా రియల్ లైఫ్ హీరోగా అందరూ భావించడం విశేషం. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు అంతా ఇంతాకాదు. దాదాపు లక్షలు వేతనం తీసుకునే ఏ రాజకీయ నాయకుడు చేయని పనిని చేశాడు. ఇందుకు ఆయన్ను కామన్‌మేన్ సైతం అభినందలు తెలియజేశారు. ముంబైలోని తన ఇంటికి వచ్చిన అభిమానులకు, అనార్తులకు, వికలాంగులకు ఇతోదికంగా సేవ చేయడం పరిపాటి అయింది.
ఆక్సిజన్ సిలెండర్లు లేకపోవడంతో ఆయనే ఆక్సిజన్ ప్లాంట్‌లను పెట్టడం విశేషం. ఇలా ఒకటికాదు రెండు కాదు ఎన్నో ప్రజాసేవలు చేసిన ఆయన తాజాగా మంగళవారంనాడు వీడియో కెమెరామెన్‌కు కరోనా సోకడంతో సికింద్రాబాద్‌లో ఆసుపత్రిలో చేరారని తెలియగానే ఆయన ట్రీట్‌మెంట్‌ను తానే భరిస్తారని భరోసా నింపారు.
ఇవన్నీ ప్రజలు ఫాలో అవుతున్నారనుకుంటా. తాజాగా సోనూసూద్ ట్విట్టర్‌లో అరుదైన మైలురాయిని సాధించారు. అతను మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో 11 మిలియన్ల మంది అనుచరుల మార్క్‌ను సాధించాడు మరియు భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకడు అయ్యాడు. ఈ విషయాన్ని సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పాలుపంచుకున్నారు.