Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ సర్కారుపై ఉమాభారతి తిరుగుబాటు... మద్యం షాపు ధ్వంసం

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (08:14 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ప్రభుత్వం మద్యం విక్రయాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తుంది. వార్షిక ఆదాయం రూ.కోటి రూపాయలు దాటిదే ఇంటి వద్దే బార్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తామని ఎంపీ సర్కారు ప్రకటించింది. 
 
దీనిపై బీజేపీ సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నిరసనలో భాగంగా, అనుచరులతో కలిసి భోపాల్‌లో ఓ మద్యం షాపును ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలంటూ ఇటీవల ఎంపీ సర్కారుకు ఉమాభారతి డెడ్‌లైన్ విధించారు. దీన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమాత్రం పట్టించుకోలేదు. వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటితే ఇంటి వద్దే బార్ ప్రారంభిచుకోవచ్చని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
దీనికితోడు మద్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రటించారు. ఇది ఉమాభారతిని మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. తాను మద్యాన్ని నిషేధించమని డిమాండ్ చేస్తే ప్రభుత్వం మరింత చౌకగా, మరింత మందికి మద్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం షాపుపై దాడికి దిగారు. కాగా, సొంత ప్రభుత్వంపైనే ఉమాభారతి ఇలా విరుచుకుపడుతుండటం ఇపుడు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments