Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ పైడితల్లి జాతర.. 18, 19 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్

Advertiesment
శ్రీ పైడితల్లి జాతర.. 18, 19 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్
, సోమవారం, 18 అక్టోబరు 2021 (11:30 IST)
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 18వ తేదీన తొలేల్ల ఉత్సవం, 19న సిరిమానోత్సవం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఎ సూర్యకుమారి. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో కార్పొరేషన్‌ పరిధిలోని ఉన్న, నగరానికి సమీపంలో గల మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు తెరవరాదని సూచించారు.
 
శాంతి భద్రతలను కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రోజులు అధికారులు తనిఖీలు చేపట్టాలని, నిబంధనలను అమలు చేయాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించిన ఏపీ సీఎం జగన్