Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ సభాముఖంగా సమాధానం : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (18:56 IST)
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14వ తేదీన జరుగనుంది. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా, వీర మహిళలు కూర్చొనేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని, గత రెండున్నరేళ్లలో ఏమేం జరిగాయి? ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భావితరాల వారికి మెరుగైన భవిష్యత్ అందించగలం? వంటి అనేక అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. 
 
అయితే, ఈ ఆవిర్భావ వేడుకలకు వచ్చేవారికి పోలీసులతో పాటు పాలకుల నుంచి అనేక ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇది మా హక్కు అని చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది మన ఆవిర్భావ దినోత్సవం. ఇది మన హక్కు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని పవన్ పునరుద్ఘాటించారు. 
 
మఖ్యంగా, గతంలో తమపై చేసిన విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసిన వారికి రేపు సభాముఖంగా సమాధానం చెబుతానని పవన్ వెల్లడించారు. ఈ సభావేదికకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టామని, ఆయన స్ఫూర్తిగానే సభ సాగుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments