Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజుకు ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తాం : హోం మంత్రి అమిత్ షా

ఠాగూర్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (10:42 IST)
దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. పైగా, మావోయిస్టుల దాడిలో ఇకపై ఒక్క పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోవడానికీ వీల్లేదని, అందువల్ల 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోల ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు. 
 
ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్‌కౌంటరులో 31 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారి. గత కొన్ని నెలలుగా మావోలకు అపార ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఈ క్రమంలో ఆదివారం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా మరణించగా 31 మంది నక్సల్స్ చనిపోయారు. ఈ ఎన్‌కౌంటరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
 
'భారత్‌ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్‌లో అతి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్‌లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి' అని అమిత్ షా సోషల్ మీడియాలో
వివరించారు.
 
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందడంపై అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజంను అంతమొందించడంలో ఇద్దరు ధైర్యశీలురైన జవాన్లను కోల్పోయాం అని పేర్కొన్నారు. ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. మరణించిన జవాన్లకుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అమిత్ షా వివరించారు.
 
అంతేకాకుండా, 2026 మార్చి 31 లోపే దేశంలో నక్సలిజంను రూపుమాపుతామని పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయేపరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 పెద్ద హిట్, గర్విస్తాను - బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు వెళ్లాను :మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి నోట జై జనసేన... నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన!!

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments