Maharashtra: స్మార్ట్ ఫోన్ల వల్ల కొంపలు కొల్లేరు అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతున్న కారణంగా అనారోగ్య సమస్యలు ఓ వైపు వేధిస్తుంటే.. మరోవైపు స్మార్ట్ ఫోన్ల వాడకంతో అన్నీ విషయాల్లో నిర్లక్ష్యం తాండవం ఆడుతోంది. తాజాగా ఓ తండ్రి తన ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. తన నాలుగేళ్ల కుమారుడిని పోగొట్టుకున్నాడు. మొబైల్ చూస్తూ వచ్చిన తండ్రి.. తన నాలుగేళ్ల కుమారుడు వెనకనే వస్తున్నాడనుకున్నాడు.
కానీ కారు వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా ఆ తండ్రి వెనక వున్న బాలుడు కారు ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అంతే ఆ కారు ఆ బాలుడిపై ఎక్కి దిగింది. నిమిషాల్లో తీవ్ర గాయాలతో ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ప్రాణాలు కొట్టుకుంటూ చివరికి మరణించాడు.
ఇదంతా చూసి ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కారు డ్రైవర్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. కారు డ్రైవర్‌పై చేజేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.