Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం అంత్యక్రియలను ఆపేసారు.. ససేమిరా అంటున్న తల్లి, సోదరి.. రోదిస్తున్న భార్య

ఠాగూర్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (10:20 IST)
ఆస్తి కోసం ఓ వ్యక్తి  అంత్యక్రియలను కన్నతల్లి, సోదరి ఆపేశారు. దీంతో గత రెండు రోజులుగా ఆ వ్యక్తి మృతదేహం ఇంటివద్దే ఉంటుంది. భర్త శవాన్ని చూసిన భార్య రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. 
 
గిద్దలూరు పట్టణానికి చెందిన హయగ్రీవ శివాచారి (32) కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో భార్య, 3 సంవత్సరాల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన శివాచారి ఈ నెల 7న ఇంటిపై నుంచి కిందపడి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
భర్త మృతదేహాన్ని తీసుకొని 8వ తేదీన ఈశ్వరి గిద్దలూరులోని అత్తింటికి వచ్చింది. శనివారం వైశ్యాబ్యాంక్ వీధిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ శివాచారి తల్లి, సోదరి తమ ఇంటి వద్ద శవాన్ని పెట్టవద్దంటూ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. బంధువులు కూడా ఆ ప్రాంతానికి రాలేదు. 
 
దీంతో ఆదివారం సాయంత్రం వరకు శవం వద్ద ఈశ్వరి రోదిస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రం సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్ సీఐ సురేశ్ అక్కడికి చేరుకొని శివాచారి తల్లి, సోదరి, భార్యతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. అయితే ఆస్తుల విషయం తేలే వరకు అంత్యక్రియలు చేయబోమని వారు తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments