Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడకపై ఉండగానే చూశారనీ ప్రియుడితో కలిసి పిల్లలను చితకబాదిన తల్లి

Advertiesment
పడకపై ఉండగానే చూశారనీ ప్రియుడితో కలిసి పిల్లలను చితకబాదిన తల్లి

ఠాగూర్

, సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (11:58 IST)
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ యువతి... తల్లి స్థానాన్ని కూడా మరచిపోయింది. తాను ప్రియుడుతో కలిసి ఉండగా, పిల్లలు చూశారని, వారిని విచక్షణా రహితంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసింది. ఎట్టకేలకు ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసుల దృష్టికి వెళ్లగా, వారు పిల్లలను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.
 
పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారదకు పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి రాహుల్, రేణుక ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విభేదించి తాడిచర్లకు చెందిన ప్రియుడు నల్లవెలుగుల పవన్‌తో కలిసి ఆమె జంగారెడ్డిగూడెం పట్టణంలో సహజీవనం చేస్తోంది. 
 
శనివారం రాత్రి తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ రాహుల్‌ను ఆమె ప్రియుడు పవన్ వైరుతో వీపుపై తీవ్రంగా కొట్టాడు. రాహుల్ భయంతో బయటికి పరుగులు తీయగా స్థానికులు గమనించి శారద, పవన్‌లకు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కొంతకాలంగా పవన్, శారదలు పిల్లలలిద్దరినీ కొడుతూ, గాయాలపై కారం చల్లి, తమ నోట్లో పచ్చిమిరపకాయ పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని బాధిత బాలుడు రాహుల్ తెలిపాడు. ఆదివారం ఈ సమాచారం కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి వెళ్లడంతో, ఆమె ఈ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెయిలుపై విడుదలై 64 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం...