బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లో ఓ దారుణ హత్యకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లీ కుమార్తె కలిసి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంలో కట్టుకున్న భర్తకు తెలియడంతో భార్య, కుమార్తెను మందలించారు. దీన్ని జీర్ణించుకోలేని తల్లీ కుమార్తెలు పథకం ప్రకారం తమ ప్రియుడుతో కలిసి భర్తను చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
భాగల్‌పూర్‌కు సమీపంలోని బారిరామసి గ్రామంలో కైలు దాస్ (35) అనే వ్యక్తికి భార్య సరితా దేవి, కుమార్తె జూలీ, ఇద్దరు కుమారులు దయానంద్, దేవానంద్‌లు ఉన్నారు. కైలు దాస్ ఓ చిన్న హోటల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో జూలీకి దినేష్ యాదవ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. దీంతో అతను తరచుగా ఇంటికి వస్తూపోతుండేవాడు. ఈ క్రమంలో అతనితో సరితా దేవి కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కైలు దాస్‌కు తెలియడంతో భార్యా, కుమార్తెను మందలించాడు. దీంతో ఆగ్రహించిన జూలీ, సరితాదేవి... శుక్రవారం రాత్రి తమ ప్రియుడితో తలిసి కైలు దాస్‌ను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారు.
ఈ క్రమంలో పెద్ద కుమారుడు దయానంద్ ఇంటికి వచ్చిన తండ్రి కనిపించకపోవడంతో తల్లిని అడిగాడు. ఆమె చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో పాటు అనుమానించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో సరితాదేవి, జూలిలతో పాటు వారికి సహకరించి దినేష్ యాదవ్‌లను కూడా అరెస్టు చేశారు. ఒకే వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుని తమ ఇంటి యజమానిని కట్టుకున్న భార్య, కుమార్తె హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.