Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త బోర్ కొట్టేస్తున్నాడని పక్కింటి యువకుడిని రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్న వివాహిత

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (18:49 IST)
పిల్లలకు పెళ్ళి చేశారు. రామా.. గోవిందా అంటూ అన్యోన్యంగా కలిసి ఉన్నారు. భార్యాభర్తలిద్దరికీ వయస్సు 50కి దగ్గరలో ఉంది. ఇలాంటి సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలి. వయస్సు పైబడుతోంది కాబట్టి కలిసి జీవించాలి. కానీ ఆ భార్య చేసిన పనికి చివరకు భర్త తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
 
బీహార్ అరారియాలోని సిమ్రాహ్ ప్రాంతమది. ఆ ప్రాంతంలో హేమంత్ గుప్త, మున్నీదేవిలు నివాసముంటున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసేశారు. ప్రస్తుతం వీరిద్దరే కలిసి ఉంటున్నారు. కొడుకు, కూతురు ఇద్దరూ వేర్వేరు కాపురం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
 
గత సంవత్సరం నుంచి మున్నీదేవిలో మార్పు గమనించాడు హేమంత్. ఆమెను హెచ్చరించాడు. మనకు ఈ వయస్సులో కావాల్సింది ఒకరికొకరి తోడు. అర్థం చేసుకో అని చెప్పాడు. భార్య వేరే యువకుడితో కలుస్తోందని తెలిసిన ఆ వృద్ధుడు ఆమె తోడునే కోరుకున్నాడు.
 
దీన్నే అదునుగా భావించింది మున్నీదేవి. తన ఇంటికి పక్కనే ఉన్న రాకేష్‌తో జరుపుతున్న వివాహేతర సంబంధం కాస్తా పెళ్ళి వరకు తీసుకెళ్ళింది. శనివారం ఏకంగా రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చింది. నేరుగా రాకేష్ ఇంటికే వెళ్ళిపోయింది.
 
విషయం తెలుసుకున్న హేమంత్ ఆవేదనకు గురయ్యాడు. భార్య లేని జీవితం వ్యర్థం అనుకున్నాడు. ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టి తన ఆవేదనను వివరిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు ఇంటికి వచ్చేలోపే అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోపే చనిపోయాడు. ప్రస్తుతం పెళ్ళి చేసుకున్న మున్నీదేవి, రాకేష్‌లు మాత్రం పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments