Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 29 March 2025
webdunia

ఆ సుఖం కోసం ప్రియుడిని కూతురికి ఇచ్చి పెళ్ళి చేసేందుకు సిద్ధమైన తల్లి?

Advertiesment
ఆ సుఖం కోసం ప్రియుడిని కూతురికి ఇచ్చి పెళ్ళి చేసేందుకు సిద్ధమైన తల్లి?
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (22:45 IST)
ఏ తల్లి బహుశా ఇలా చేయదనుకుంటా. భర్తతో గొడవపడి కూతురితో కలిసి ఉన్న ఒక మహిళ ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. ఆ యువకుడికి పెళ్ళిచూపులు చూస్తున్నారని తెలుసుకుని అతనికి తన కూతురిని ఇచ్చి వివాహం చేసి శారీరక సుఖాన్ని కొనసాగించాలని ప్లాన్ చేసింది. కానీ చివరకు కటకటాల పాలైంది. 
 
కర్ణాటక రాష్ట్రం దావణగెరే ప్రాంతానికి చెందిన మాధవి భర్తతో విబేధాల కారణంగా కూతురితో కలిసి ఉంటోంది. స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న రంగనాథ్ అనే యువకుడితో మాధవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
రంగనాథ్ వయస్సులో చిన్నవాడైనా సరే ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఇంట్లోనే వీరు రాసలీలల్లో మునిగితేలేవారు. కూతురు కూడా పట్టించుకోలేదు. ఇంట్లో మగదిక్కు కూడా లేకపోవడంతో ఆమె సర్దుకుపోయింది. అయితే గత రెండునెలల నుంచి రంగనాథ్‌కు వారి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
 
ఈ విషయాన్ని మాధవికి చెప్పాడు రంగనాథ్. దీంతో ఆమె మథనపడిపోయింది. రంగనాథ్‌కు పెళ్ళి అయితే తనకు ఆ సుఖం ఉండదని ఆలోచనలో పడిపోయింది. తనకు ఒక ఆలోచన వచ్చింది. పెళ్ళీడుకు వచ్చిన తన కూతురిని రంగనాథ్‌కు ఇచ్చి పెళ్ళి చేస్తే ఇంట్లో హాయిగా ఉండొచ్చనుకుంది.
 
ఇంకేముంది ఇదే విషయాన్ని కుమార్తెకు చెప్పింది. తల్లి మాటలు విని ఆమె షాక్‌కు గురైంది. ఆమె దగ్గర సరేనని తలూపి ఆ తరువాత తన స్నేహితురాలికి విషయం చెప్పేసింది. సరిగ్గా మూడు రోజుల క్రితం పెళ్ళికి ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే విషయం స్నేహితురాలి ద్వారా పోలీసులకు తెలియడంతో మాధవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలికను సంరక్షణా కేంద్రానికి పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టాక్ మార్కెట్ అస్థిరతను ఎలా నిర్వహించాలి?