Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో చెల్లెలి రాసలీలలను కళ్లారా చూసిన అన్న, ఏమైందంటే?

Advertiesment
married sister
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (22:32 IST)
చెల్లికి పెళ్ళయ్యింది. భర్తతో విభేదించి పుట్టింటికి వచ్చేసింది. అయితే పుట్టింటికి వచ్చిన చెల్లి ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధాన్ని కళ్ళారా చూశాడు అన్న. చెల్లెని హెచ్చరించాడు. తన విషయం అన్న బయట ఎక్కడ చెప్పేస్తాడేమోనని సొంత అన్ననే అతి దారుణంగా చంపేసింది చెల్లి.
 
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నివాసముండే గంజి సాంబయ్య, నాగమ్మ దంపతుల కుమార్తె ఆదిలక్ష్మికి, రేగులగడ్డకు చెందిన నాగరాజుతో వివాహమైంది. నాగరాజు మద్యానికి బానిస కావడంతో ఆరు నెలల ముందే ఇంటి నుంచి వచ్చేసింది ఆదిలక్ష్మి.
 
పుట్టింటిలోనే తల్లిదండ్రులతో ఉంటోంది. ఆదిలక్ష్మి అన్న పోతురాజు స్థానికంగా ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇంటి దగ్గర ఉండే ఆదిలక్ష్మి తన ఇంటికి సమీపంలో ఉన్న తన క్లాస్‌మేట్ రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత రెండు నెలల నుంచి ఈ బంధం సాగుతోంది.
 
అన్న పోతురాజుకి విషయం తెలిసింది. తన చెల్లి, రాజు ఇద్దరూ కలిసే ఏకాంతం ప్రాంతంలోకి వెళ్ళాడు పోతురాజు. ఆగ్రహంతో ఊగిపోయాడు. రాజును చితకబాదాడు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆదిలక్ష్మి అన్నను చంపేయాలని ప్లాన్ చేసింది.
 
ఇంటికి వచ్చిన పోతురాజుకు అన్నంలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అది తెలియకుండా తినేసిన పోతురాజు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియుడి సాయంతో ఇంటిలోనే రోకలిబండతో నెత్తిపై కొట్టి చంపేసింది. ఆ తరువాత ఏమీ ఎరుగనట్లు ఇంట్లో నిద్రపోయింది. 
 
మరుసటి రోజు నెత్తుటిమరకలో ఉన్న పోతురాజును చూసిన తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే మొదట్లో తనకేమీ సంబంధం లేదని బుకాయించిన ఆదిలక్ష్మి చివరకు నిజాన్ని ఒప్పుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికులపై రైల్వేశాఖ పెనుభారం, సామాన్యులకు చార్జీల మోత